- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. నగల కోసం తల్లిని చంపిన కుమారుడు
by Vemula.Srinu Prasad |
ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది...

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(NTR District)లో దారుణం జరిగింది. నగల కోసం తల్లి(Mother)ని కుమారుడు(Son) చంపేశారు. ఈ ఘటన విజయవాడ గుణదల మధునగర్(Vijayawada Gunadala Madhunagar)లో జరిగింది. 62 ఏళ్ల లక్ష్మి స్థానికంగా నివాసం ఉంటున్నారు. అయితే తనకు ఆస్తి రాసివ్వాలంటూ తల్లితో పెద్ద కుమారుడు సాంబశివరావు గొడవపడుతున్నారు. ఈ క్రమంలో లక్ష్మిని కుమారుడు సాంబశివరావు, కోడలు దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని మాయం చేశారు. పోలీసులు తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే విచారణలో కుమారుడే హత్య చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు సాంబశివరావును అదుపులోకి తీసుకుని విచారించగా తల్లిని తాను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి 4 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story






