ఏపీ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి శ్రీకాంత్ అరెస్ట్

by Thanuru Gopichand |

మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) ఆరోపణల నేపథ్యంలో విజయవాడ పటమట పోలీసులు ఏపీ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి (AP Kabaddi Association) వై.శ్రీకాంత్ ను అరెస్టు చేశారు.

ఏపీ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి శ్రీకాంత్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) ఆరోపణల నేపథ్యంలో విజయవాడ పటమట పోలీసులు ఏపీ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధి (AP Kabaddi Association) వై.శ్రీకాంత్ ను అరెస్టు చేశారు. శ్రీకాంత్ పై చర్యలు తీసుకోవాలని కబడ్డీ సంఘం మాజీ కార్యదర్శి కేపీ రావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యను తీసుకున్నారు. కబడ్డీలో రాణించాలనే తమ ఆశలపై వై.శ్రీకాంత్ నీళ్లు చల్లారని జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారులు ఇటీవల ఆరోపించారు. గత మూడేళ్లుగా ఎంత మంది అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని అన్నారు. శ్రీకాంత్ కు మున్సిపల్ కమిషనర్, శాప్ ఉన్నతాధికారులు, నగర పోలీసు అధికారులు, ఓ ఎమ్మెల్సీ అండదండలు ఉన్నట్లు వారు ఇటీవల ఆరోపించారు. ఈ మేరకు గత నెల వారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద నిరసనకు దిగారు. కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పనిచేసిన శ్రీకాంత్ అవినీతితో పాటు అసోసియేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారు ఆరోపణలు గుప్పించారు. అతడిని అసోసియేషన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మాజీ కార్యదర్శి కబడ్డీ సంఘం కేపీ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీకాంత్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Next Story