- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామాజిక బాధ్యతతో మెలగాలి : ఎన్టీఆర్ జిల్లా పోలీస్
రౌడీ షీట్ కలిగిన వారికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.

దిశ, వెబ్ డెస్క్ : రౌడీ షీట్ కలిగిన వారికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓల ఆధ్వర్యంలో పోలీసు స్టేషన్లకు వారిని పిలిపించారు. నేరాలు చేయకుండా బుద్ధిగా మెసలుకోవాలన్నారు. సమాజంలో సామాజిక బాధ్యతతో (Social Responsibility) మెలగాలని వారికి సూచించారు. మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్యలు కలిగించకుండా సత్ప్రవర్తనతో నడుచుకోవాలని స్పష్టం చేశారు. మళ్లీ నేరాలకు పాల్పడితే చట్టపరంగా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే తమ తొలి ప్రాధాన్యం అన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు..
రాత్రివేళ డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవర్లకు నిద్రొస్తుంటుంది. కానీ గమ్యస్థానానికి చేరాలనే ఉద్దేశంతో నిద్ర మత్తులో వాహనాలను నడుపుతుంటారు. తద్వారా పలుమార్లు ప్రమాదాలను కొనితెచ్చుకుంటారు. ఈ విషయంలో డ్రైవర్లకు అవగాహన కల్పించి, వారిని చైతన్యపరిచేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో, 'స్టే అవేక్, స్టే అలైవ్ (𝐒𝐭𝐨𝐩, 𝐖𝐚𝐬𝐡, 𝐑𝐞𝐟𝐫𝐞𝐬𝐡 & 𝐆𝐨” — 𝐒𝐭𝐚𝐲 𝐀𝐰𝐚𝐤𝐞, 𝐒𝐭𝐚𝐲 𝐀𝐥𝐢𝐯𝐞) అనే నినాదంతో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖం కడుక్కోవడం, కాఫీ తాగడం ద్వారా నిద్ర మత్తు నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు. ఒకవేళ నిద్ర మత్తును వీడలేని పరిస్థితిలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్నారు. నిద్రమత్తు వీడిన తరువాతనే ప్రయాణించాలని స్పష్టం చేశారు.
హుండీ చోరీ కేసులో నిందితుల అరెస్ట్..
విజయవాడ సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ (Satyanarayana Puram Police Station) పరిధిలోని ఓ దేవాలయంలో హుండీ నగదు చోరీ జరిగింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అదే విధంగా బైక్, ఆటో చోరీల కేసుల్లో కూడా నిందితులను సత్యనారాయణపురం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుల నుంచి రూ.2.70 లక్షల నగదు, వాహనాలను రికవరీ చేశారు.






