తిరువూరు జడ్పీ స్కూల్‌లో బహిరంగ చర్చకు రండి: కొలిక‌పూడి శ్రీనివాస్ సవాల్

by Vemula.Srinu Prasad |

బడ్జెట్‌పై చర్చకు రావాలని కూటమికి తప్ప అన్ని పార్టీలకు కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సవాల్ విసిరారు..

తిరువూరు జడ్పీ స్కూల్‌లో బహిరంగ చర్చకు రండి: కొలిక‌పూడి శ్రీనివాస్ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా(Krishna District) తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్(Thiruvur MLA Kolikapudi Srinivas) వ్యవహారం టీడీపీ(Tdp)లో కొంతకాలంగా వివాదస్పదంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ సొంతపార్టీలోనే కలకలం సృష్టించడంతో పలుమార్లు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) పిలిచి మాట్లాడారు. దీంతో టీడీపీ నేతలను వదలిపెట్టి ఇప్పుడు ప్రతిపక్షాలపై పడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌పై పార్టీలు చేస్తున్న విమర్శలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


బడ్జెట్‌పై చర్చించేందుకు బహిరంగ చర్చకు రావాలని అన్ని పార్టీలు, ప్రజా సంఘాల నాయకులకు సవాల్ విసిరారు. అంతేకాదు తన వాట్సాప్ స్టేటస్‌లోనూ పెట్టుకున్నారు. ఈ నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు తిరువూరు జిల్లా పరిషత్ స్కూల్‌లో బహిరంగ చర్చకు తాను సిద్ధమని వాట్సాప్ స్టేటస్ ద్వారా ఆహ్వానించారు. దీంతో కొలికిపూడి తీరు చర్చగా మారింది.

Next Story