Minister Kollu Ravindra: ఆ ఆక్రమణలపైనే ఫోకస్..?

by Jakkula.Mamatha |

కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో ఆక్రమణలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం(AP Government) అడుగులు వేస్తోంది.

Minister Kollu Ravindra: ఆ ఆక్రమణలపైనే ఫోకస్..?
X

దిశ,వెబ్‌డెస్క్: కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నంలో ఆక్రమణలకు చెక్ పెడుతూ కూటమి ప్రభుత్వం(AP Government) అడుగులు వేస్తోంది. గతంలో జరిగిన ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. వైసీపీ నేతల(YCP Leaders) కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మచిలీపట్నం వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మూడు స్తంభాల సెంటర్‌లో మడుగు పోరంబోకు భూమిలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) రాజకీయ స్వార్థం కోసం వేసిన అక్రమ గృహ నిర్మాణాలను కూల్చివేయడం, జిల్లా పరిషత్ సెంటర్ లో మున్సిపాల్టీకి చెందిన చెరువు చుట్టూ వైసీపీ సానుభూతిపరుల సహకారంతో వేసిన వాణిజ్య దుకాణాలను తొలగించడం జరిగిందన్నారు.

తాజాగా వైసీపీ నేతల కబ్జాకు గురైన తమ్మన వారి సత్రాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది. వందేళ్ల క్రితం తమ్మన పిచ్చయ్య అనే వైశ్య ప్రముఖులు అపరకర్మల నిమిత్తం బలరాముని పేటలో 616 చ.గల స్థలాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ(Devadaya Charity Department)కు విరాళంగా అందజేశారు. సదరు స్థలంలో దాతల సహకారంతో సత్రం నిర్మించారు. సత్రం అద్దెల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించారు. ఆ తర్వాత సత్రం నిర్వహణ సరిగా లేకపోవడం పై కన్నేసిన ఆక్రమణదారులు ఆక్రమించారు. దీనిపై అప్పట్లోనే ప్రతిపక్ష నేతగా ఉన్న మంత్రి కొల్లు రవీంద్ర పోరాటం చేశారని గుర్తు చేశారు.

Next Story