హార్ట్ సర్జరీ తర్వాత బయటికి వచ్చిన కొడాలి నాని!

by velandi.Saikiran |

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని ( Kodali Nani) బయటకు వచ్చారు. గుండెకు సంబంధించిన సర్జరీ

హార్ట్ సర్జరీ తర్వాత బయటికి వచ్చిన కొడాలి నాని!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని ( Kodali Nani) బయటకు వచ్చారు. గుండెకు సంబంధించిన సర్జరీ చేయించుకున్న తర్వాత తొలిసారి.. హైదరాబాదులో అడుగుపెట్టారు కొడాలి నాని. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత నెలలో కొడాలి నాని కి... సర్జరీ అంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


మొదట హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో... చికిత్స తీసుకున్న కొడాలి నాని... అనంతరం సర్జరీ నిమిత్తం ముంబైకి వెళ్లిపోయారు. అక్కడ దాదాపు 8 గంటల పాటు గుండెకు సంబంధించిన సర్జరీ చేయించుకున్నారట కొడాలి నాని. అయితే సర్జరీ అనంతరం దేశం విడిచి అమెరికాకు వెళ్లాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటికే ఏపీలో చాలా కేసులు కొడాలి నాని పైన నమోదు అయ్యాయి. ఈ తరుణం లో అమెరికాకు వెళ్లాడని కొడాలి నాని పై వార్తలు రావడంతో ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

అయితే ఇంతలోనే హైదరాబాదులోని ఓ వివాహ కార్యక్రమానికి కొడాలి నాని హాజరైనట్లు ఒక ఫోటో వైరల్ అవుతుంది. లుక్ అవుట్ నోటీసులు జారీ అయిన మరుసటిరోజే.. కొడాలి నాని ఇలా ప్రత్యక్షమయ్యారు. దీంతో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. నిజానికి కొడాలి నాని సర్జరీ తర్వాత ఈ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారా? లేదా అంతకంటే ముందే జరిగిన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారా? అనే విషయం తేడాల్సి ఉంది.

Next Story