- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్యను తుపాకీతో బెదిరించిన కేసులో కీలక మలుపు
అనంతపురంలో (Anantapur) భార్యను ఓ భర్త ఇటీవల తుపాకీతో (Gun) బెదిరించాడు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : అనంతపురంలో (Anantapur) భార్యను ఓ భర్త ఇటీవల తుపాకీతో (Gun) బెదిరించాడు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది. భర్త తుపాకీతో బెదిరించడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్య ఫిర్యాదు మేరకు జిమ్ ఓనర్ అయిన రాజశేఖర్ ను విచారించారు. కాగా అతను తుపాకీ పొందిన తీరును నిందితుడు వెల్లడించాడు. అనంతపురం ఎస్పీ పి.జగదీశ్ కూపీ లాగడంతో మధ్యప్రదేశ్ ముఠా గన్స్ విక్రయించినట్లు తెలిసింది. దీంతో దర్యాప్తును ముమ్మరం చేసిన అనంతపురం పోలీసులు మధ్యప్రదేశ్ ముఠాలో నలుగురిని స్థానికంగా, మరో ఇద్దరిని మధ్యప్రదేశ్ లో అరెస్టు చేశారు. అయితే చివరి నిమిషంలో గన్స్ సరఫరా చేసే ముఠాలోని కీలక వ్యక్తులు తప్పించుకున్నారు. వారి కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను పట్టుకోవడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం ముఠాలో కీలకమైన ముగ్గురు సభ్యులను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5 కంట్రిమేడ్ రివాల్వర్లు, 30 బుల్లెట్లు, ఒక కాళీ మ్యాగజైన్, ఒక తల్వార్ ను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్ కు చెందిన ముఠాగా వారిని గుర్తించారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.






