Kesineni: కేశినేని బ్రదర్స్.. ఒకరిపై ఒకరు తగ్గేదేలే..

by Thanuru Gopichand |   (  Updated:2025-04-23 06:27:55  IST  )

కేశినేని బ్రదర్స్​.. రాజధాని ప్రాంతంలో ఇప్పుడు హాట్​టాపిక్​గా మారారు.

Kesineni: కేశినేని బ్రదర్స్..  ఒకరిపై ఒకరు తగ్గేదేలే..
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: కేశినేని బ్రదర్స్​.. రాజధాని ప్రాంతంలో ఇప్పుడు హాట్​టాపిక్​గా మారారు. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ పొలిటికల్​హీట్​పుట్టిస్తున్నారు. విజయవాడ మాజీ ఎంపీ (NTR Bhavan) కేశినేని నాని (Kesineni Nani) మరోసారి టీడీపీ ఎంపీ, తమ్ముడైన కేశినేని చిన్ని (శివనాథ్‌)ని టార్గెట్ చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ భవన్‌ (NTR Bhavan) పేరును ప్రస్తావిస్తూ అక్కడ చేసే పనులు మాత్రం వేరే అంటూ ఫేస్‌బుక్ పోస్ట్ షేర్ చేశారు. ఇది విజయవాడ ప్రజలు చరిత్రలో లేని విధంగా భారీ మెజారిటీతో తనను గెలిపించుకున్నారు అని గర్వంగా చెప్పుకునే ప్రజాప్రతినిధిగారి కార్యాలయం పేరు. కానీ ఇక్కడ కూర్చుని ఆయన చేసేది ఇసుక వ్యాపారం, ఫ్లై ఆష్ తోలకం, గ్రావెల్ అమ్మకం, భూ దందాలు, బ్రోకరేజీలు, పేకాట గృహాలు, రేషన్ బియ్యం మాఫియా దగ్గర వసూళ్లు వగైరా వగైరా అని పేర్కొన్నారు. నీ కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి 'చార్లెస్​శోభరాజ్​భవన్​’ అని పెడితే బాగుంటుందని నిన్ను భారీ మెజార్టీతో గెలిపించిన విజయవాడ ప్రజల కోరిక' అంటూ పోస్టులో పేర్కొన్నారు. దానికి కేశినేని చిన్ని (Chinni) స్పందించారు. ‘ఎన్టీఆర్​జిల్లా ప్రజలకు ముఖ్యగమనిక.. మతిభ్రమించిన సైకో సోషల్​మీడియా రోడ్లపై తిరుగుతున్నాడని, చిప్పు దొబ్బి పగ ప్రతీకారంతో రగిలిపోతున్నాడని ఓ పోస్టు చేశారు. విజయవాడ అభివృద్ధిపై విషం చిమ్ముతున్న సైకోపై స్పందిచాల్సిన అవసరం లేదని.. అయితే అప్రమత్తంగా ఉండాలిని ఆయన సూచించారు. ఈ పోస్టులు బెజవాడ పాలిటిక్స్​లో కాక రేపుతున్నాయి.

ఎన్నికలు పూర్తయిన తర్వాత కేశినేని అన్నదమ్ముల మధ్య వార్​నడుస్తోంది. గతంలో వ్యాపారాలకు పరిమితమైన కేశినేని చిన్ని విజయవాడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో బ్రదర్స్​ మధ్య వైరం పెరిగింది. 2024 ఎన్నికలకు ముందు కేశినేని వైసీపీలో చేరారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల్లో కేశినేని చిన్ని టీడీపీ నుంచి కేశినేని నాని వైసీపీ అభ్యర్థిగా పోటీచేయగా.. చిన్ని విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. ఆ వెంటనే కొద్ది రోజులకు కేశినేని నాని తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కొంతకాలంగా ఆయన రాజకీయాలకు సంబంధించిన ట్వీట్‌లు, పోస్ట్‌లు మొదలుపెట్టారు.. రెండు రోజులుగా తమ్ముడ్ని టార్గెట్ చేసిన ఆయన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవరం లేదంటూ చిన్ని ఈ రోజు పోస్టు చేశారు.

Next Story