- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ మా అందరి కంటే జూనియర్.. ఎమ్మెల్యే గోరంట్ల హాట్ కామెంట్స్
కేసీఆర్ తన కంటే జూనియర్ అని.. ఆయన రాజకీయంగా ఎదిగిందే తెలుగుదేశం పార్టీలో కాదా అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Buchaiah Chowdhury) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ తన కంటే జూనియర్ అని.. ఆయన రాజకీయంగా ఎదిగింది తెలుగుదేశం పార్టీలో కాదా అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Buchaiah Chowdhury) అన్నారు. ఇవాళ ఆయన రాజమండ్రి (Rajahmundry)లో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోల్పోయినప్పుడల్లా చంద్రబాబు నాయుడు మీద పడి ఏడవడం బీఆర్ఎస్ (BRS) పార్టీకి బాగా అలవాటు అయిపోయిందని చురకలు అంటించారు. కేసీఆర్ తన కంటే జూనియర్ అని కామెంట్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా విజయరమణారావుకు ఇచ్చారంటూ పార్టీలోనే నాడు ఉద్యమాలు చేశారని గోరంట్ల అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రాజెక్టుల రూపకల్పన, విధానాలపై విచారణలు జరుగుతున్నాయని.. అవి తట్టుకోలేక చంద్రబాబు మీద ఏడుస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా అదనంగా సముద్రంలోకి కలిసిపోయే నీటిని వాడుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) తప్పుడు విధానాలతో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు, సాగునీటి వివాదాలు, ప్రాజెక్టుల అవినీతి వంటి అంశాలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం స్నేహపూర్వకంగా ముందుకు వెళ్తోందని, బీఆర్ఎస్ వైఫల్యాలను దాచిపెట్టడానికే చంద్రబాబుపై విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు. అయితే, ప్రస్తుతం గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.






