గాజుల అలంకరణలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ

by Seetharam |   (  Updated:2023-11-15 09:23:08  IST  )

ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు బుధవారం భక్తులకు గాజుల అలంకరణలో దర్శనమిచ్చారు.

గాజుల అలంకరణలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారు బుధవారం భక్తులకు గాజుల అలంకరణలో దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో గాజుల అలంకరణలో అమ్మవారి దర్శనమిస్తుంటారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం అమ్మవారు ప్రజలకు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి మూల విరాట్‌తో పాటు, ఆలయ ప్రాంగణమంతా గాజులతో ఆలయ అధికారులు అలంకరించారు. గాజుల అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

Next Story