Kidney Rocket Case: ఆరుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్

by Vemula.Srinu Prasad |

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు నిందితులకు జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు..

Kidney Rocket Case: ఆరుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్
X

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు నిందితులకు జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో వారిని రిమాండ్‌కు తరలించారు. కాగా విశాఖకు చెందిన మహిళ నుంచి కిడ్నీ తీసుకునేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆమె మదనపల్లెకు చేరుకున్నారు. ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి సమయంలో చనిపోయారు. దీంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు అయింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలు రాబట్టారు. కిడ్నీ ఆపరేషన్ చేసిన డాక్టర్ పరారీ ఉండటంతో ఆయన కోసం బెంగళూరులో గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులను విచారణ తర్వాత కోర్టుకు హాజరుపర్చారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో వారిని మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.

Next Story