- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: 25 మంది మావోయిస్టులకు రిమాండ్ పొడిగింపు
ఇరవై ఐదు మంది మావోయిస్టులకు జడ్జి రిమాండ్ పొడిగించారు...

X
దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా విజయవాడకు సమీపం పెనమలూరు ప్రాంతంలో 25 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వారి రిమాండ్ గడువు ముగియడంతో జైలు నుంచే వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపర్చారు. దీంతో 25 మంది మావోయిస్టుల రిమాండ్‌ను ఈలనెల 29 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా నవంబర్ 18న కృష్ణా జిల్లా పెనమలూరులో ఉన్నట్లు సమాచారం అందుకున్న అక్టోపస్ బలగాలు.. ఓ అపార్ట్ మెంట్‌పై మెరుపు దాడి చేశాయి. ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చి తలదాచుకున్న 25 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేస్తున్నారు. అనంతరం వారందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా జైలులో ఉన్నారు. తాజాగా రిమాండ్ గడువు ముగియడంతో జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు.
Next Story






