- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోగి బ్రదర్స్‌కు మూడు రోజుల కస్టడీ
నకిలీ మద్యం కేసులో మరోసారి నిందితుల విచారణ.

దిశ, వెబ్ డెస్క్ : నకిలీ మద్యం కేసులో (Fake Liquor Case) నిందితుల విచారణ కొనసాగుతోంది. కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) తోపాటు ఆయన సోదరుడు రామును ఎక్సైజ్ పోలీసులు మూడు రోజులపాటు కస్టడీకి తీసుకోనున్నారు. ఈ మేరకు అధికారులు వేసిన పిటిషన్ కు కోర్టు అనుమతించింది. దీంతో విజయవాడ జైలు నుంచి జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ పోలీసులు విజయవాడ ఈస్ట్ ఎక్సై్జ్ స్టేషనుకు తరలించారు. నకిలీ మద్యం కేసులో మూడు రోజులపాటు వారిని విచారించనున్నారు. అయితే నకిలీ మద్యం కేసులో జనార్థన్ రావు, జగన్మోహన్ రావు సోదరులకు జోగి బ్రదర్స్ అండగా ఉన్నారని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వారి అక్రమాలకు జోగి బ్రదర్స్ అన్ని విధాల సహాయ సహకారాలు అందించినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారిపై ఆరోపణలను మోపారు. అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను సేకరించిన ఎక్సైజ్ అధికారులు గతేడాది నవంబరులోనూ జోగి బ్రదర్స్ ను విచారించారు. మరిన్ని ఆధారాలను సేకరించేందుకు మరోమారు వారిని కస్టడీలోకి తీసుకున్నారు.






