- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జెఎన్టీయు - గురజాడ వర్సిటీ విద్యార్థి బలవన్మరణం
ఏం కష్టమొచ్చిందో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

దిశ, వెబ్ డెస్క్ : విజయనగరంలోని జెఎన్టీయు - గురజాడ యూనివర్సిటీలో (JNTU - Gurajada) హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం ఉదయ్ వెంకటతేజ (Uday Venkata Teja) అనే విద్యార్థి వర్సిటీలో ఈఈఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. యూనివర్సిటీ వసతి గృహంలోనే ఉంటూ తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో అతను అనుకోకుండా బలవన్మరణానికి పాల్పడ్డాడు. వసతి గృహంలోని గదిలో ఉరేసుకొని ప్రాణాలను విడిచాడు. ఇది గమనించిన విద్యార్థులు వసతి గృహం అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. అనంతరం మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు విద్యార్థులను విచారించారు. అయితే మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






