సినీనటి మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ న‌టి మాధ‌వీల‌త జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి కూడా తాడిప‌త్రిలో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని అన్నారు.

సినీనటి మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ న‌టి మాధ‌వీల‌త జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈసారి కూడా తాడిప‌త్రిలో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు నిర్వ‌హిస్తున్నామ‌ని అన్నారు. గ‌తంలో హీరోయిన్ మాధ‌వీల‌త త‌మ‌పై అభాండాలు వేసింద‌ని చెప్పారు. ఈసారి ఆమెతో కాంప్ర‌మైజ్ అయ్యామ‌ని ఇద్ద‌రం స్వారీ చెప్పుకున్నామ‌ని అన్నారు. ఈ సారి మాధ‌వీల‌త‌నే చీఫ్ గెస్ట్ గా పిలిచామ‌ని చెప్పారు. ఆమెకు తాను త‌ప్పైందని స్వారీ చెప్పాన‌ని ఆమె కూడా చెప్ప‌డంతో కాంప్ర‌మైజ్ అయ్యామ‌ని అన్నారు.

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌ను ఒక్కో రోజు ఒక్కో విధంగా నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ 31న తాడిపత్రి పార్కులో నిర్వహించిన న్యూఇయర్ వేడుకలు నిర్వహించారు. మహిళల కోసం జేసీ ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించగా ఆ వేడుకలకు వెళ్లొద్దు అంటూ మాధవీలత సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. దీంతో ఆమెపై జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ నువ్వా నేనా అనే రేంజ్ లో గొడవ పడ్డారు. ఇక ఇప్పుడు న్యూఇయర్ సమీపిస్తుండగా జేసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story