JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష షురూ..

by Ramesh Naini |

న్యూ ఇయర్ వేళ తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం దీక్ష ప్రారంభించారు.

JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష షురూ..
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్ వేళ తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం దీక్ష ప్రారంభించారు. గాంధీ బొమ్మ సెంటర్‌లో టెంట్ ఏర్పాటు చేసుకుని ఆయన దీక్ష షురూ చేశారు. తన ప్రవర్తనపై ప్రజల్లో నెలకొన్న భిన్నాభిప్రాయాలపై స్పష్టత ఇవ్వడం, తన మనసులోని అభిప్రాయాలను తాడిపత్రి ప్రజలకు నేరుగా తెలియజేయడమే ఈ దీక్ష ఉద్దేశమని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాను ఎందుకు అలా ప్రవర్తించాల్సి వస్తుందో వివరించేందుకే ఈ నిరాహార దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకు తన ప్రవర్తనను మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

తాడిపత్రిని అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం

మున్సిపల్ ఛైర్మన్‌గా తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఖర్చు చేసిన నిధుల వివరాలను ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు వివరించారు. ఏ అభివృద్ధి పనికి ఎంత మొత్తం వెచ్చించామన్న అంశాలపై పూర్తి లెక్కలు చూపేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, అడిగే ప్రతి రూపాయికి లెక్క చెబుతానని ప్రకటించారు. 2026 నాటికి తాడిపత్రిని మరింత అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలే తనకు అత్యంత ముఖ్యమని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికే ఈ దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు.

Next Story