- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3 వేల మందితో జనసేన ‘పదవి - బాధ్యత’ కార్యక్రమం
కూటమి ప్రభుత్వంలో జనసేన (Janasena) తరపున ఇటీవల పలువురు నామినేటెడ్ పదవులు పొందారు.

దిశ, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వంలో జనసేన (Janasena) తరపున ఇటీవల పలువురు నామినేటెడ్ పదవులు పొందారు. వారి పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అదే విధంగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నామినేటెడ్ పదవులు పొందిన వారికి కార్యక్రమం వేదికగా దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్ర నాదెండ్ల మనోహర్ పేరిట జనసేన కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకనటను విడుదల చేసింది.
కూటమి ప్రభుత్వంలో జనసేన పక్షాన పదవులు పొందిన వారితో పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం (రేపు) సమావేశం అవుతారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటనలో పేర్కొన్నారు. మూడు వేల మందితో పదవి - బాధ్యత (Padavi - Badytha) పేరిట నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. ఇందులో నూతనంగా నామినేటెడ్ పదవీ బాధ్యతలు చేపట్టిన వారికి జనసేనాని దిశా నిర్దేశం చేస్తారన్నారు. మంగళగిరిలోని సి.కె.కన్వెన్షన్ లో జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమ విషయమై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. పార్టీ తరపున నిర్వహిస్తున్న పదవి - బాధ్యత కార్యక్రమం చాలా కీలకమైనదని మనోహర్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రసంగం జనసేన శ్రేణులందరికీ మార్గదర్శకంగా ఉండబోతుందని ప్రకటించారు.






