- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్ళీ గుర్తు చేయొద్దు.. ఈసారి ఆ 11 కూడా రావు: రామ్ తాళ్లూరి
మళ్ళీ 3 రాజధానులు, మావిగన్ అని గుర్తు చేతే ఈసారి ఆ 11 కూడా రావు అని, ఆ విషయాన్ని ఇప్పటికైనా జగన్ అర్థం చేసుకోవాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై జగన్‌తో పాటు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: మళ్ళీ 3 రాజధానులు, మావిగన్ అని గుర్తు చేతే ఈసారి ఆ 11 కూడా రావు అని, ఆ విషయాన్ని ఇప్పటికైనా జగన్ అర్థం చేసుకోవాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై జగన్‌తో పాటు వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. లేదంటే ఎప్పటికీ మీడియాలో కామెడీ ప్రెస్ మీట్స్ కు అంకితం అయిపోతారనే విషయం అర్థం చేసుకోవాలని రామ్ సూచించారు. వ్యక్తిగత ఆరోపణలు, కుట్ర కథనాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు మానుకోవాలని రామ్ తాళ్లూరి హితవు పలికారు.
విధ్వంసంపై సమాధానం మంచిది
వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసానికి సమాధానం చెప్పడం మంచిదని, ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని, రాష్ట్రానికి స్థిరమైన నాయకత్వం, అభివృద్ధి కావాలనే NDA కూటమికి స్పష్టమైన మద్దతు అందించారని రామ్ తాళ్లూరి పేర్కొన్నారు. 5 ఏళ్ల నియంతృత్వ వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులు, అరాచకం, అయోమయంలోకి నెట్టిన పులివెందుల MLA జగన్.. అమరావతి, అభివృద్ధి, అవినీతిపై మాట్లాడడం ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి రైతులను ఐదేళ్లు ఇబ్బందులకు గురి చేసి, మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టింది వైసీపీ ప్రభుత్వమేనని, ఇప్పుడు అమరావతిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ నాయకత్వంలో తిరిగి గాడిలో పెట్టేందుకు NDA ప్రభుత్వం కృషి చేస్తోందని రామ్ తాళ్లూరి పేర్కొన్నారు.






