Breaking: వాలంటీర్లపై పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
Breaking: వాలంటీర్లపై పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం రేగింది. దీంతో పవన్ కల్యాణ్‌పై వాలంటీర్లు, వైసీపీ నేతలు భగ్గుమన్నారు. నిరసనలు వ్యక్తం చేశారు. పవన్ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. మహిళలకు పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అయితే పవన్ కల్యాణ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. మరోసారి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్ వ్యవస్థ అని ఆరోపణలు చేశారు. వాలంటీర్ వ్యవస్థ సేకరించిన డేటా ఎక్కడికో వెళ్తుందన్నారు. ఇన్ని వ్యవస్థలు ఉండగా వాలంటీర్ల వ్యవస్థతో పనేంటని ప్రశ్నించారు. తాను చెప్పేది కొందరి వాలంటీర్ల గురించి అని చెప్పారు. ప్రజల డేటా వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తోందని, పది మంది ఇంటింటికీ తిరుగుతుంటే ఎలా అని ప్రశ్నించారు. వాలంటీర్లకు రూ.5 వేలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశమిచ్చారని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజల డేటా అంతా వాలంటీర్లకు తెలుసన్నారు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అంతా తెలుస్తుందన్నారు. ఈ సమాచారం వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తే ఎలా పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్దేశం వేరే అవ్వొచ్చని.. సున్నితమైన సమాచారమంతా బయటకు వెళ్తే ఎలా అని పవన్ వ్యాఖ్యానించారు. సంస్కారం, చదువు సీఎం జగన్‌కు నేర్పించాలని విమర్శించారు. ఇంట్లో ఆడవాళ్ల వైపు రాకూడదనే సంస్కారం నేర్పిస్తానని పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే ప్రజలకు పవన్ కల్యాణ్ పలుసూచనలు కూడా చేశారు. ‘వాలంటీర్‌ వ్యవస్థను చాలా జాగ్రత్తగా చూడాలి.. వారితో అప్రమత్తంగా ఉండాలి.. వాళ్లపని వారు చేస్తే పర్లేదు.. వైసీపీకి మాత్రమే పనిచేస్తామంటే గట్టిగా అడగండి. ఆడబిడ్డలు ఉన్న కుటుంబాలు మరింత అప్రమత్తంగా ఉండాలి.. అనవసరంగా మీ డేటావారికి ఇవ్వకండి.. వాలంటీర్ల అందరి గురించి మాట్లాడటంలేదు. వంద తాజా పళ్లలో ఒక్కటి కుళ్లినా మిగతావి కుళ్లుతాయి. వాలంటీర్లు సమాంతర పోలీస్‌ వ్యవస్థ, సమాంతర అడ్మినిస్టేషన్ వ్యవస్థ, సమాంతర రాజకీయ వ్యవస్థగా మార్చేశారు. వాలంటీర్‌ వ్యవస్థ ఇప్పుడు సరిగా చూడకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ఇబ్బంది.’ అని పవన్ కల్యాణ్ సూచించారు.

Next Story

Most Viewed