- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్‌ను హైదరాబాద్‌లో అడ్డుకునే దమ్ముందా: ఆర్కే సాగర్ సవాల్
ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై ఏపీలో కేసుల నమోదు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త పాశం యాదగిరి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ..

దిశ, వెబ్ డెస్క్: ప్రొఫెసర్ నాగేశ్వరరావు(Professor Nageswara Rao)పై ఏపీ(Ap)లో కేసుల నమోదు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్(Jana Sena chief Pawan Kalyan)పై సీనియర్ జర్నలిస్టు, సామాజిక కార్యకర్త పాశం యాదగిరి(Senior journalist social activist Pasham Yadagiri) ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు తెలంగాణ జనసేన పార్టీ(Telangana Janasena Party) స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో జనసేన తెలంగాణ ప్రచార కమిటీ చైర్మన్ ఆర్.కె. సాగర్ మాట్లాడుతూ పాశం యాదగిరిపై విరుచుకుపడ్డారు. ‘‘మీరు చేసిన వ్యాఖ్యలను మీ ఇంట్లో వాళ్లకు చూపించండి. వాళ్లు హర్షిస్తే మేము తప్పు చేశామని ఒప్పుకుంటాం. ఒక మనిషిలా అలా మాట్లాడతారా..?. మీరు మాట్లాడిన వీడియో మీరే చూసుకుని సిగ్గుపడండి. ఇంకోసారి తప్పుగా మాట్లాడకుండా ఉండాలంటే ఒక్కసారైనా సిగ్గుపడండి. సినిమా ఆర్టీస్టులకు సిగ్గు, నీతి, న్యాయం, శీలం అసలేం ఉండదా..?. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఆకలితో పొస్తులుండి సినిమా ఆర్టీస్టులవుతున్నారు. పవన్ కల్యాణ్‌ను హైదరాబాద్ లో అడ్డుకుంటారా..?. ఆ దమ్ముందా..?. తేల్చుకుందాం. ఖబద్దార్.. తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉండబోతోంది.’’ అని ఆర్కే సాగర్ హెచ్చరించారు.






