Shanti Prasad : అల్లుఅర్జున్ పై జనసేన నేత శాంతి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-12-07 16:45:00  IST  )

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)పట్ల మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ జనసేన(Jana Sena) శ్రేణుల చిటపటలు కొనసాగుతునే ఉన్నాయి.

Shanti Prasad : అల్లుఅర్జున్ పై జనసేన నేత శాంతి ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)పట్ల మేనమామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ జనసేన(Jana Sena) శ్రేణుల చిటపటలు కొనసాగుతునే ఉన్నాయి. ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ప్రచారం చేశారని, పుష్పా 2 ఈవెంట్ లో మెగా ప్యామిలీ ప్రస్తావన తేలేదని అల్లు అర్జున్ పై కోపంతో సినిమా విడుదల అడ్డుకుంటామని హెచ్చరికలు చేసిన జనసేన నేతలు నాగబాబు చొరవతో వెనక్కి తగ్గారు. మళ్లీ ఏమైందో ఏమోగాని జనసేన మరో నేత సింగలూరి శాంతి ప్రసాద్(Shanti Prasad) అల్లు అర్జున్ పై ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిలాటలో మరణించిన రేవతికి అల్లు అర్జున్ రూ. 25 లక్షలు సహాయం ప్రకటించారు. అల్లు అర్జున్‌ నిర్ణయాన్ని శాంతిప్రసాద్ తప్పుబట్టారు.

అల్లు అర్జున్ కి సినిమా పారితోషికం రూ300 కోట్లు కావాలి..ఆయన సినిమా కలెక్షన్స్ రూ. 2000 కోట్ల పైనే ఉండాలి కాని..అల్లు అర్జున్ సినిమాకి వచ్చి అన్యాయంగా బలైన కుటుంబానికి కేవలం 25 లక్షలు మాత్రమే ఇస్తారా ? అంటూ మండిపడ్డారు. అల్లు అర్జున్ కు, ఆయన నిర్మాతలకు సిగ్గు శరం ఉందా ? వాళ్ళని అసలు మనుషులుంటారా? మానవత్వం ఉందా? కేసు మాఫీ కోసం ముష్టా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి ప్రసాద్ చేసిన విమర్శలు ట్వీ్ట్ వైరల్ గా మారింది.

Read More...

Pushpa 2: పుష్ప-2 పై అలాంటి ప్రచారం చేస్తున్న వారికి మైత్రి మూవీ మేకర్స్ హెచ్చరిక


Next Story