‘హరి హర వీరమల్లు’ పై దుష్ప్రచారం.. వారికి జనసేన నేత స్ట్రాంగ్ వార్నింగ్

by Jakkula.Mamatha |

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరి హర వీరమల్లు.

‘హరి హర వీరమల్లు’ పై దుష్ప్రచారం.. వారికి జనసేన నేత స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ నిధి అగర్వాల్ నటించారు. ఈ మూవీ జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలై.. మిక్స్‌డ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు మూవీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. అయితే, హరి హర వీరమల్లు సాధించిన అఖండ విజయంతో పవన్ కల్యాణ్ ప్రత్యర్థులకు కడుపు మండుతోందని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు.

అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఎవరెన్ని కుట్రలు చేసిన హరి హర వీరమల్లు మూవీ కలెక్షన్లు ఆపలేరని జనసేన నేత కిరణ్ రాయల్ తేల్చి చెప్పారు. ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. పైరసీపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీకీ జనసేన నేత కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. అనంతరం ‘‘వైసీపీకి పవన్ అన్న భయమే.. పవన్ కళ్యాణ్ సినిమాలన్న భయమే’’ అని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే వైసీపీ మాజీ మంత్రులు సినిమా పై దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు.

Next Story