- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర పండుగగా జగ్గన్న తోట ప్రభల తీర్థం
by Muthe.Rajitha |
450 ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గన్న తోట ప్రభల తీర్థాలను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది.

X
దిశ, వెబ్ డెస్క్ : 450 ఏళ్ల చరిత్ర కలిగిన జగ్గన్న తోట ప్రభల తీర్థాలను ఏపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలో ఏటా సంక్రాంతి సమయంలో జరిగే జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. జిల్లాలోని మలికిపురం గ్రామంలో జరిగిన ఓ సినిమా చిత్రీకరణ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సినీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కు స్థానికులు ఇచ్చిన వినతి పత్రంపై ఆయన స్పందించారు.
ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆమోదం తెలిపారని వెల్లడించారు. 450 సంవత్సరాల చరిత్ర కలిగిన జగ్గన్న తోట ప్రభల తీర్థ ఉత్సవాలను ఇకపై రాష్ట్ర పండగగా జరుపుతామని పేర్కొన్నారు.
Next Story






