- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jagan V/s Pawan: జగన్ వర్సెస్ పవన్.. ఏపీలో పొలిటికల్ హీట్
ఏపీలో ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి.. మరో వైపు పొలిటికల్హీట్కూడా పెరుగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎండలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి.. మరో వైపు పొలిటికల్హీట్కూడా పెరుగుతోంది. కొద్దిరోజుల కిందట అసెంబ్లీ (AP Assembly)బడ్జెట్‌సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్జగన్తన మిగిలిన పదిమంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు. కేవలం 11 నిమిషాలపాటే అసెంబ్లీలో ఉండి వెళ్లిపోయారు. అటెండెన్స్కోసమే ఆయన వచ్చాడని టీడీపీ(TDP) ఆరోపించింది. ఆ తర్వాత ఈ రోజు జగన్తన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అంటూ ఎద్దేవా చేశారు. పవన్ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారని అన్నారు. అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నించారు. సభలో ఇంతమంది సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా (Opposition status)ఉంటుందని ఎక్కడా రూల్ లేదన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చానన్నారు. ఎంతసేపైనా మాట్లాడమని చంద్రబాబుకు మైక్ ఇచ్చానని గుర్తు చేశారు.
అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ప్రసంగం అనంతరం.. పవన్‌కల్యాణ్ (Pawan Kalyan)మీడియా పాయింట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లలో మీకు ప్రతిపక్ష హోదా రాదంటూ జగన్‌ను ఉద్దేశించి తేల్చి చెప్పారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ పట్టుపట్టడం మాని అసెంబ్లీకి వచ్చి తమ సమస్యలు వినిపించాలని ఆయన సూచించారు. పైగా ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదన్నారు. ప్రజలే ఆ హోదా జగన్‌కు ఇవ్వలేదని గుర్తు చేశారు. జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా ప్రతిపక్ష హోదా వచ్చేదన్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీకి వెళ్లవచ్చని సూచించారు. ఇదే విషయాన్ని ఈ రోజు విలేకరులు.. జగన్‌వద్ద ప్రశ్నించగా ఆయన పవన్‌పై విమర్శలు చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్ఎప్పుడూ తన విమర్శనాస్త్రాలు చంద్రబాబు (Chandra babu), ఆయన కుమారుడు లోకేశ్ (Nara Lokesh)పైనే ఎక్కుపెడుతుంటాడు. కారణాలేవైనా పవన్‌పై డైరెక్టుగా వ్యాఖ్యలు చేయడం తక్కువే. అయితే ఈ సారి ఆయన పవన్‌ను కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని అనడం జనసైనికుల్లో కాక రేపుతోంది. మాజీ సీఎం జగన్‌వ్యాఖ్యలపై జనసైనికులు మండిపడుతున్నారు. జగన్క్రిమినల్కి ఎక్కువ.. ప్రతిపక్ష నేతకు తక్కువ అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రజలు నీకు ఈ హోదా ఇవ్వలేదని తమ నాయకుడు పవన్ అంటే నీకు ఎందుకంత ఏడుపని ప్రశ్నిస్తున్నారు. నాలుగు గోడల మధ్య కూర్చుని ప్రెస్మీట్లు పెట్టడం కాదని సూచిస్తున్నారు. మొత్తం మీద జగన్ప్రతిపక్ష హోదా అంశం.. పొలిటికల్‌హీట్(Political heat)ను పెంచింది.






