- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరకామణి కేసుపై మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
పరకామణి కేసుపై మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరకామణి కేసు ఆశ్చర్యకర కేసు అని అన్నారు. హుండీ డబ్బులు లెక్కపెడుతూ చిన్న దొంగతనం చేశారని తొమ్మిది డాలర్లు దొంగలించారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పరకామణి కేసుపై మాజీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరకామణి కేసు ఆశ్చర్యకర కేసు అని అన్నారు. హుండీ డబ్బులు లెక్కపెడుతూ చిన్న దొంగతనం చేశారని తొమ్మిది డాలర్లు దొంగలించారని అన్నారు. ఆ దొంగను పట్టుకోవడం నేరం అవుతుందా అని ప్రశ్నించారు. దీనికి పాయిశ్చిత్తంగా దొంగ నుంచి రూ.14 కోట్ల విలువైన ఆస్తులను దేవుడికి తిరిగి ఇప్పించడం నేరం అవుతుందా..? అని ప్రశ్నించారు. దేశంలో అనేక ఆలయాల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు.
దొంగ దొరికినప్పుడు అన్ని కోర్టుల పరిధిలో జరగాల్సిన జ్యుడీషియల్ ప్రొసీజర్ అంతా జరిగిందని చెప్పారు. ఇందులో సాంకేతిక పరమైన అంశాలు ఉంటే దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. కానీ రాజకీయాలను మనసులో పెట్టుకుని అక్కడ చైర్మన్ గా భూమన, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారనే కారణంగా కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. అక్కడ పని చేసిన బీసీ పోలీస్ అధికారిని వేధించి వెంటాడి చంపేశారని ఆరోపించారు. ఏదో జరిగిందని చెప్పేలా వారి మీడియాతో కథనాలు రాయిస్తున్నారని అన్నారు.






