వైసీపీ నేతలందరూ MS ధోనిలా దూసుకుపోవాలి - జగన్

by velandi.Saikiran |   (  Updated:2025-04-29 09:59:27  IST  )

వైసీపీ నేతలందరూ MS ధోనిలా ( Ms Dhoni) దూసుకుపోవాలని కోరారు ఏపీ మాజీ సీఎం జగన్ ( Jagan). YSRCP జిల్లా అధ్యక్షులతో

వైసీపీ నేతలందరూ MS ధోనిలా దూసుకుపోవాలి - జగన్
X

దిశ, వెబ్ డెస్క్ : వైసీపీ నేతలందరూ MS ధోనిలా ( Ms Dhoni) దూసుకుపోవాలని కోరారు ఏపీ మాజీ సీఎం జగన్ ( Jagan). YSRCP జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై నేతలతో చర్చించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు ( Chandrababu) ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో (AP) అమలవుతోందని మండిపడ్డారు. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైసీపీయే అని పేర్కొన్నారు.

ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైసీపీయే.. మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలని ఆదేశించారు. జూన్‌-జులైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్‌ కమిటీలు పూర్తిచేయాలని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్‌ కమిటీలు ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారని పార్టీ నేతల్లో భరోసా నింపారు. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది... మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలన్నారు. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలని ఆదేశించారు.

బాధ్యతల నుంచే అధికారం వస్తుందన్నారు. జిల్లాల్లో మీరే సర్వం.. మీరే పార్టీ.. పార్టీయే మీరు అని వెల్లడించారు.జిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీదన్నారు. అందరూ ధోనీల్లా తయారు కావాలిని... జిల్లాల్లో ఏం జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలని కోరారు జగన్. కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

.

లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే.

బాధితులకు మనం అండగా ఉండాలి.

మనమంతా రాజకీయ నాయకులం.

మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు.

ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు.

జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం.

మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం.

ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం.

నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను.

అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.

పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి.

Next Story