వైసీపీ కార్యకర్తలు గిరిధర్‌, సతీష్‌కు జగన్ ఫోన్.. పరామర్శ

by Vemula.Srinu Prasad |

జనసేన కార్యకర్తల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలు గిరిధర్‌, సతీష్‌కు జగన్ ఫోన్ చేసి పరామర్శించారు..

వైసీపీ కార్యకర్తలు గిరిధర్‌, సతీష్‌కు జగన్ ఫోన్.. పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) కార్యకర్తలు గిరిధర్‌, సతీష్‌కు పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) ఫోన్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌(Janasena Chief Pawan Kalyan)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మచిలీపట్నం(Machilipatnam)లో గిరిధర్‌‌, సతీశ్‌పై జనసేన పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో గిరిధర్‌‌, సతీశ్‌ గాయపడ్డారు. దీంతో వారికి జగన్ ఫోన్ చేసి పరామర్శించారు. దాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని తెలిపారు. తనపై దాడి చేయడంతో పాటు తనకు జీవనాధారమైన షాపును కూడా ధ్వంసం చేశారని జగన్‌కు సతీశ్ తెలిపారు. దీంతో జగన్ మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై దాడి బాధాకరమన్నారు. రాజకీయాలు దిగజారిపోయాయని చెప్పారు. తమకు టైమ్ వస్తుందని, అప్పుడు చెబుతామని కార్యకర్తలకు జగన్ భరోసా ఇచ్చారు.

Next Story