బొట్టుతో కనిపించిన జగన్.. అవాక్కయిన వైసీపీ నాయకులు

by Muthe.Rajitha |   (  Updated:2025-07-29 16:25:58  IST  )

నేడు జరిగిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ మీటింగ్ లో వైఎస్సాఆర్సీపీ(YSRCP) అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) కొత్త లుక్ లో కనిపించారు.

బొట్టుతో కనిపించిన జగన్.. అవాక్కయిన వైసీపీ నాయకులు
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు జరిగిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ మీటింగ్ లో వైఎస్సాఆర్సీపీ(YSRCP) అధినేత జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) కొత్త లుక్ లో కనిపించారు. PAC సమావేశానికి జగన్ బొట్టుతో వచ్చారు. దీంతో అక్కడి నేతలంతా ఆశ్చర్యపోయారు. ఏదైనా గుడికి వెళ్లిన సందర్భం కాకుండా మిగతా సమయాల్లో జగన్ బొట్టు పెట్టుకోవడం అరుదే. అలాంటిది నేడు సమావేశానికి బొట్టుతో రావడంతో.. జగన్ స్టైల్ మార్చారని వైసీపీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సమావేశంలో పార్టీ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నామని, తమ పార్టీ నేతలను, కార్యకర్తలను వేధించిన కూటమి నాయకులు, అధికారుల పేర్లు ఆధారాలతో సహా అందులో చేర్చి, తాము అధికారంలోకి వచ్చాక వారికి సినిమా చూపిస్తామని జగన్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story