- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20 మందికి పైగా చనిపోవడం దురదృష్టకరం : మంత్రి అనగాని సత్యప్రసాద్
by Thanuru Gopichand |
కర్నూలు జిల్లాలోని చిన్న టేకూరు వద్ద తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిదింది.

X
దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలోని చిన్న టేకూరు వద్ద తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిదింది. బస్సులో మంటలు చెలరేగడంతో అందులోని పలువురు ప్రయాణీకులు మరణించారు. మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై ఏపీ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా చనిపోవడం దురదృష్టకరం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story






