- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం బాధాకరం : NBK
కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో చోటు చేసుకున్న విషాద ఘటనపై అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో : కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో చోటు చేసుకున్న విషాద ఘటనపై అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సభలో కార్యకర్తలు మృతి చెందడం తన మనసును తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాలకృష్ణ ట్వీట్ చేశారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం అత్యంత బాధాకరమన్నారు. 8 మంది మరణ వార్త 80 లక్షల కార్యకర్తల కుటుంబాల్లో విషాదం నింపిందన్నారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని నందమూరి బాలకృష్ణ ఆకాంక్షించారు.
Also Read...
Next Story






