‘వర్షం’ మూవీ రీ రిలీజ్.. థియేటర్ వద్ద కొట్టుకున్న ఫ్యాన్స్.. కారణం ఇదే!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-23 12:26:00  IST  )

రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం వర్షం విడుద‌లై దాదాపు 21 ఏళ్లు అవుతుంది.

‘వర్షం’ మూవీ రీ రిలీజ్.. థియేటర్ వద్ద కొట్టుకున్న ఫ్యాన్స్.. కారణం ఇదే!?
X

దిశ,వెబ్‌డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ త్రిష కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం వర్షం విడుద‌లై దాదాపు 21 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాను మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. ఇవాళ(మే 23) వర్షం సినిమా రీ రిలీజ్ సందర్భంగా ప్రభాస్ అభిమానులు భారీ ఎత్తున థియేటర్ల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh)లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ(Vijayawada)లోని జయరామ్ థియేటర్ వద్ద వర్షం రీ రిలీజ్ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో వచ్చారు. ఈ తరుణంలో, ఓ కారణం పై ఫ్యాన్స్ గొడవ పడ్డారు. ఓ విషయంలో ఇరు వర్గాల మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్త పరస్పరం దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఒకరు గాయపడినట్లు సమాచారం. వీరి గొడవను చూసి అక్కడ ఉన్నవారు ఇరువర్గాలకు సర్ధి చెప్పి పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story