టీడీపీతో అలయన్స్ దశాబ్ధకాలమా?...పెళ్లి మాత్రం మూడురోజుల్లో తెంచేస్తావ్: పవన్ కల్యాణ్‌పై అంబటి సెటైర్లు

by Disha Web Desk 21 |
టీడీపీతో అలయన్స్ దశాబ్ధకాలమా?...పెళ్లి మాత్రం మూడురోజుల్లో తెంచేస్తావ్: పవన్ కల్యాణ్‌పై అంబటి సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులు, టికెట్ సర్ధుబాట్లు, కేటాయింపులతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇకపోతే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ రెండు పార్టీలు పొత్తుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పొత్తుపై జనసేనాని పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీతో పొత్తు పదేళ్లయినా కొనసాగాలని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీ బాగుపడాలంటే తమ పొత్తు కొనసాగాలని జనసేనాని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఈ పొత్తుపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో అలయన్స్ దశాబ్దకాలం కావాలంటావ్... మూడు ముళ్లు మాత్రం మూడు రోజుల్లో తెంచేస్తావ్... అంటూ సెటైర్లు వేశారు. ఇకపోతే 2014 ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. అనంతరం మధ్యలోనే విడిపోయింది. 2019 ఎన్నికల్లో ఇరు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. తాజాగా ఇటీవలే రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ఇరు పార్టీల మధ్య పొత్తు చిగురించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు.

Next Story

Most Viewed