వంగలపూడి అనిత యాంకరా..హోం మంత్రా? మాజీ మంత్రి RK రోజా సెటైర్లు

by Kema Shiva Kumar |

అనిత వంగలపూడి (Anitha Vanagalapudi) యాంకరా.. హోం మంత్రా అని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా (RK Roja) సెటైర్లు వేశారు.

వంగలపూడి అనిత యాంకరా..హోం మంత్రా? మాజీ మంత్రి RK రోజా సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: అనిత వంగలపూడి (Anitha Vanagalapudi) యాంకరా.. హోం మంత్రా అని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా (RK Roja) సెటైర్లు వేశారు. ఇవాళ ఆమె నగరిలో మీడయాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం కూటమి ప్రభుత్వానికి చేతకాడం లేదని మండిపడ్డారు. రాష్టంలో నిర్మించ తలపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలను జగన్ పూర్తి చేశారని గుర్తు చేశారు. అందులో 5 ఐదు మెడికల్ కాలేజీలు వైసీపీ హయాంలోనే ప్రారంభించగా.. ఇప్పటికే క్లాసులు కూడా మొదలయ్యాయని పేర్కొన్నారు. మిగతా కాలేజీల నిర్మాణాలను కక్షపూరితంగా నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించడం లేదని మండిపడ్డారు.

వారానికి ఒకసారి హైదరాబాద్ AIG‌కి వెళ్లి ఎవరు మందులు వేసుకుంటారో అందరికీ తెలుసని అన్నారు. కళ్లార్పకుండా అబద్దాలు ఎలా ఆడాలో చంద్రబాబు మందు కనిపెట్టి టీడీపీ నేతలందరికీ ఇచ్చాడంటూ కామెంట్ చేశారు. అసలు అనిత వంగపూడి యాంకరా.. హోం మంత్రా అని సైటర్లు వేశారు, రాజమండ్రి, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, పాడేరు మెడికల్ కాలేజీలను పరిశీలించడానికి వస్తావా హోం మంత్రి..! మెడికల్ కాలేజీలు ఎలా ఉంటాయో, విద్యార్థులు ఎలా ఉంటారో చూపిస్తా అంటూ ఆర్కే రోజా సవాలు విసిరారు.

Next Story