సీఎం చంద్రబాబుకు వినూత్నంగా బర్త్ డే విషెస్.. విశాఖ తీరంలో!?

by Jakkula.Mamatha |

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వజ్రోత్సవ (75వ) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సీఎం చంద్రబాబుకు వినూత్నంగా బర్త్ డే విషెస్.. విశాఖ తీరంలో!?
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వజ్రోత్సవ (75వ) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు భారీ కేక్ కటింగ్స్ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సీఎంకు విషెస్ చెబుతున్నారు. ఈ తరుణంలో తాజాగా సీఎం చంద్రబాబుకు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ(VMRDA) వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేసింది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) 75వ పుట్టినరోజు సందర్భంగా వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్(VMRDA Chairman Pranav Gopal) ఆధ్వర్యంలో MGM బీచ్‌లో సైకత శిల్పం రూపొందించారు. నరసింహ చారి అనే యువకుడు ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం విశాఖ తీరంలో ఈ సైకత శిల్పం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story