- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడ నుంచి సింగపూర్ కు ఇండిగో విమాన సేవలు
విజయవాడ నుంచి నేరుగా సింగపూర్ కు విమానమెక్కి కేవలం నాలుగు గంటల్లోనే వెళ్లొచ్చు.

దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ నుంచి నేరుగా సింగపూర్ కు విమానమెక్కి కేవలం నాలుగు గంటల్లోనే వెళ్లొచ్చు. ఇప్పటికే విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. కాగా ఇండిగో సంస్థ కొత్తగా విజయవాడ-సింగపూర్ మధ్య నవంబరు 15 నుంచి విమాన సేవలను అందుబాటులో తెస్తోంది. ఇప్పటికే వెబ్ సైటులో టిక్కెట్ బుకింగ్ లను కూడా ప్రారంభించింది. టిక్కెట్ ధరను రూ.8,000లుగా ఇండిగో సంస్థ నిర్ణయించింది. అయితే ఈ అంతర్జాతీయ విమాన సేవలు ప్రతి మంగళ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటాయి. సింగపూర్ నుంచి ఉదయం 7.45 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకునే విమానం ఉదయం 10.05 గంటలకు తిరుగు ప్రయాణమవుతుంది. మధ్యాహ్నం 2.05 గంటలకు సింగపూర్ లోని చాంగి ఎయిర్ పోర్టుకు చేరుకుంటుంది. ప్రస్తుతం సింగపూర్ ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ సేవలు అందుబాటులోకి రావడం పట్ల విమాన ప్రయాణికుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సేవలను ప్రారంభించనున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే ఈ విషయం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై నెలలో చర్చించారు. అనంతరం కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ఇండిగో సంస్థతో చర్చించి వంద రోజుల్లో ప్రణాళికను ఆచరణలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల విజయవాడ, అమరావతి ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు లబ్ధి పొందుతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఇరు ప్రాంతాల మధ్య పర్యాటకం పెంచేందుకు కూడా దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






