భారత మహిళా క్రికెటర్ల ఫ్లైట్ డైవర్ట్

by Muthe.Rajitha |

తీవ్రమైన పొగమంచు కారణం వల్ల నేడు విశాఖపట్నంలోని విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

భారత మహిళా క్రికెటర్ల ఫ్లైట్ డైవర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : తీవ్రమైన పొగమంచు కారణం వల్ల నేడు విశాఖపట్నంలోని విమానాశ్రయం నుంచి బయల్దేరాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అతి తక్కువ విజిబిలిటీ వలన వైజాగ్ కు రావాల్సిన పలు విమానాలను దారి మళ్లించారు. అయితే విశాఖలో జరగనున్న శ్రీలంక–భారత్ మహిళా టీ20 క్రికెట్ మ్యాచ్‌ల కోసం, ముంబై నుంచి విశాఖకు వస్తున్న భారత మహిళా క్రికెటర్ల ఇండిగో ఫ్లైట్ ను కూడా దారిమళ్లించారు. లో విజిబిలిటీ వలన వారు ప్రయాణిస్తున్న విమానాన్ని విజయవాడకు డైవర్ట్ చేసారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని విమానాశ్రయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇదే సమయంలో విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానం కూడా రద్దైనట్లు సమాచారం. అయితే డిసెంబర్ నెలలో విశాఖలో తరచుగా పొగమంచు ఏర్పడటంతో విమానాల రాకపోకలకు ఇలాంటి అంతరాయాలు ఎదురవుతున్నాయి.

Next Story