- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం సతీమణిపై అనుచిత పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు
సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై, వారి కుటుంబ సభ్యలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాళ్లు మరో పార్టీ వాళ్లపై హద్దు మీరి అనుచిత పోస్టులు పెడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రాజకీయ నాయకులపై, వారి కుటుంబ సభ్యలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఒక పార్టీకి సపోర్ట్ చేసేవాళ్లు మరో పార్టీ వాళ్లపై హద్దు మీరి అనుచిత పోస్టులు పెడుతున్నారు. చాలా మందిపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపినా మార్పు రావడంలేదు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు సతీమణిపై విష్ణు బొట్ల అనే వ్యక్తి అనుచిత పోస్టులు చేశాడు. దీంతో టీడీపీ మహిళా నాయకురాలు లీలావతి చిత్తూరు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యలపై విష్ణు అనే వ్యక్తి అనుచిత పోస్టులు పెడున్నాడని ఆరోపించారు. వ్యక్తిత్వ హననం చేస్తూ కించపరుస్తూ పోస్టులు పెడుతున్నాడని మండిపడ్డారు. ట్విట్టర్ లో అతడి పోస్టులు చూసి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కుటుంబంపైనే అనుచిత వ్యాఖ్యలు చేసే బరితెగించారని మండిపడ్డారు. సీఎం కుటంబానికే రక్షణ లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణుబొట్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరవాత సోషల్ మీడియాపై నిఘా పెంచింది. ఏ పార్టీ అయినా అనుచిత పోస్టులు పెడితే, కుటంబాలను రాజకీయాల్లోకి లాగితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఆ దిశగానే ఎవరిపై ఫిర్యాదు అందినా తక్షణమే చర్యలు తీసుకుంటోంది.






