AP News: 'ఫ్రీ హోల్డ్ స్కాం'లో.. వెలుగులోకి మరో బాగోతం.! మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు

by Geesa Chandu |

ఫ్రీ హోల్డ్ స్కాంలో.. మరో భాగోతం బయటకి వచ్చింది.

AP News: ఫ్రీ హోల్డ్ స్కాంలో.. వెలుగులోకి మరో బాగోతం.! మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఫ్రీ హోల్డ్ స్కాంలో.. మరో భాగోతం బయటకి వచ్చింది. ఫ్రీ హోల్డ్ లోకి కొన్ని ప్రభుత్వ భూములు వెళ్లినట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి, రిజిస్ట్రేషన్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. నిజమైన అసైనీలకు న్యాయం చేసేందుకు ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ లను నిలిపివేసినట్లు ఆయన అన్నారు. వాటి వ్యవహారంలో జరిగిన తప్పులను సరిచేస్తామని, అసలైన అసైనీలకు వందకు వంద శాతం న్యాయం చేస్తామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం వైసీపీ నేతలు కుట్ర పూరితంగా ఎస్సీ, ఎస్టీ ల అసైన్డ్ భూములను చౌకకు కొట్టేశారని అన్నారు. అసైన్డ్ చట్టానికి సవరణ వస్తుందని ముందుగానే గ్రహించి, అసైనీల నుంచి భూములను చాలా తక్కువ ధరకే వైసీపీ నేతలు కొన్నట్లు మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా గిఫ్ట్ డీడ్లుగా మార్చి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని.. 20 సంవత్సరాల పరిమితి దాటని భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేశారని, దానికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందని ఈ సందర్భంగా మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు తెలిపారు.

Next Story