- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ రూల్స్.. నిబంధనలు పాటించకపోతే!
రాష్ట్రంలో వాహనాదారులకు బిగ్ అలర్ట్.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వాహనాదారులకు బిగ్ అలర్ట్. ఏపీ(Andhra Pradesh)లో ఇక నుంచి ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) అతిక్రమిస్తే ఇక దబిడి దిబిడే అంటున్నారు పలువురు అధికారులు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 1వ తేదీ నుంచి ట్రాఫిక్ రూల్స్‌లో కొన్ని కొత్త నిబంధనలు చేర్చారు. హైకోర్టు(High Court) ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ అమలు కానుంది. ఈ చట్టం ప్రకారం వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా అనుభవించాల్సి ఉంటుంది.హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుంటే రూ.1000, మద్యం తాగి వాహనాలు నడిపితే రూ.10వేల జరిమానా తో పాటు లైసెన్స్ రద్దు వంటి నిబంధనలను పెట్టారు.
బైక్ వెనక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఓవర్ స్పీడ్(Over Speed), సిగ్నల్ జంప్(Singnal Jamp), రాంగ్ రూట్‌లో వెళితే రూ.1000, డ్రైవింగ్ లైసెన్స్(Driving Rules) లేకుండా వాహనాలు నడిపితే రూ.5వేల జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు(Traffic Rules) అతిక్రమించిన వాహనదారులకు ఇంటికే చలాన్ కాపీని పంపించనున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచించారు.






