కరోనా కేసులు పెరుగుతుంటే.. పాఠశాలలు నిర్వహిస్తారా?

by Web Desk |
కరోనా కేసులు పెరుగుతుంటే.. పాఠశాలలు నిర్వహిస్తారా?
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా పాజిటివ్‌ కేసులు ప్రమాదకరంగా పెరుగుతుంటే, విద్యాసంస్థలు నిర్వహిస్తారా అని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. కేసులు పెరిగితే, పాఠశాలలు మూసివేయడం గురించి ఆలోచిద్దాం అని విద్యాశాఖ మంత్రి చెప్పిన నాటి నుంచి కేసులు అధికమయ్యాయన్నారు. నేడు 14 వేలకు పైగా కేసులు వచ్చాయనీ, ఇంకా ఎన్ని కేసులు పెరగాలని నిలదీశారు. ఇప్పటికే పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు వైరస్‌ బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆదివారం నాదెండ్ల ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారన్నారు. ఫిబ్రవరి రెండో వారం వరకు విద్యా సంస్థలు మూసివేస్తే చిన్నారులను కరోనా నుంచి రక్షించుకునే అవకాశం ఉందని సూచించారు. ప్రతి నలుగురిలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారని, ఫీవర్‌ సర్వేలు చెబుతున్న గణాంకాలు ఆందోళన కలిగిస్తుందన్నారు. వైద్యలు, ఆసుపత్రి సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారని, అందువల్ల వైద్య సేవలకు అవాంతరాలు ఎదురవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు.

Next Story