మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటా: సీఎం జగన్ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు

by Disha Web Desk 21 |
మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటా: సీఎం జగన్ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘మీ సంక్షేమమే లక్ష్యంగా, మీ రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నాను’అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అక్కచెల్లెమ్మలకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నాపై మీరు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞుడని’ అంటూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ట్విటర్ వేదికగా రాఖీ శుభాకాంక్షలు తెలియజేసింది.‘ఒక సోదరుడిగా రాష్ట్రంలోని ప్రతి అక్కచెల్లమ్మకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా సాధికారత కల్పిస్తూ… ఈ నాలుగేళ్ల పాలనలో దేశచరిత్రలోనే ఎవరూ చేయని విధంగా అన్ని అంశాల్లో మహిళలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు సీఎం జగన్. అక్కచెల్లెమ్మలు అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటూ రాష్ట్రంలోని ప్రతి సోదరికి రాఖీ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని వైసీపీ ట్వీట్ చేసింది.



Next Story

Most Viewed