నేను రేపు ఉంటానో లేదో తెలియదు.. కన్నీళ్లు పెట్టిన TTD మెంబర్ భాను‌ప్రకాష్ రెడ్డి

by Kema Shiva Kumar |

రేపు తాను బతికి ఉంటానో లేదో తెలియదని బీజేపీ సీనియర్ నేత, టీటీడీ మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను రేపు ఉంటానో లేదో తెలియదు.. కన్నీళ్లు పెట్టిన TTD మెంబర్ భాను‌ప్రకాష్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రేపు తాను బతికి ఉంటానో లేదో తెలియదని బీజేపీ సీనియర్ నేత, టీటీడీ మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎవరి మీద వ్యక్తిగతంగా ద్వేషం లేదన్నాని అన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే తనకు ప్రాణమని.. గత 20 ఏళ్లుగా స్వామికి కాపలా కుక్కలాగా పనిచేస్తూ అన్యాయాలు, అక్రమాలపై పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఇటీవల పరకామణిలో చోరీపై ప్రత్యర్థులు తాను పెట్టిన కేసును వదిలేయాలంటూ తీవ్రంగా వేధిస్తున్నారని, తనపై తీవ్రమైన ఒత్తడి ఉందన్నారు. లొంగని పక్షంలో సోషల్ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాను అన్ని రకాలుగా బాధపడుతున్నా తన భార్య, బిడ్డలు ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని, ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మనకు ఉన్నాయంటూ ధైర్య చెప్పారని భానుప్రకాశ్ రెడ్డి కన్నీళ్లు పెట్టారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story