- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అనడంలో తప్పేముంది: హైపర్ ఆది
సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కల్యాణ్ వల్లేనని, పక్కన వాళ్ల మాటలు విని విమర్శిస్తే మంచిది కాదని నటుడు హైపర్ అది అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: సుగాలి ప్రీతికి న్యాయం జరిగిందే పవన్ కల్యాణ్ వల్లేనని, పక్కన వాళ్ల మాటలు విని విమర్శిస్తే మంచిది కాదని నటుడు హైపర్ అది అన్నారు. పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇస్యూపై ఆయన స్పందించారు. పవన్ కల్యాణ్‌తో అమిత్ షా ఇలా మాట్లాడారంటూ తప్పుగా మాట్లాడినప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు డబ్బులు తీసుకునే అన్నారని జనసైనికులు అనడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. పవన్‌ను విమర్శిస్తే, ఆయనను అభిమానించే వారు రియాక్ట్ అవుతారని హైపర్ ఆది పేర్కొన్నారు. ఇది రేడియో కాలం కాదని, సోషల్ మీడియా కాలమని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గుర్తు పెట్టుకోవాలన్నారు. విశ్లేషణను స్వాగతిస్తారని, తప్పులను కాదన్నారు. తమరు తప్పు మాట్లాడటం వల్లే కాదా.. విత్ డ్రా చేసుకున్నారని హైపర్ ఆది గుర్తు చేశారు.
వివాదం ఇలా..
కాగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాల్లో రాజకీయ, ప్రాంతీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. జగన్‌ను అరెస్ట్ చేయాలంటూ హోంమంత్రి అమిత్ షాకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై తీవ్రమైన విమర్శలు చేశారు. అంతేకాదు ఆయనపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు సైతం నమోదు చేశారు. దీంతో ఈ వివాదం మరింత పెరిగింది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. కానీ ఏపీలో తనపై పెట్టిన కేసులను ఆయన ఖండించారు. దీంతో తెలంగాణ ప్రాంతంపై దాడిగా పేర్కొంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు మద్దతుగా నిలిచారు. ప్రెస్ మీట్ పెట్టి మరి ఆంధ్రా ప్రాంతంతో పాటు అక్కడి నాయకులపైనా తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నటుడు హైపర్ ఆది స్పందించారు. మరి హైపర్ ఆది వ్యాఖ్యలపై కౌంటర్లు ఎలా ఉంటాయో చూడాలి.






