టీటీడీ చైర్మన్‌పై దుష్ప్రచార కథనాలు ప్రసారం, ప్రచారం చేయొద్దు.. హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్

by Ramesh Naini |

టీటీడీ చైర్మన్‌గా నా పై జరుగుతున్న విషప్రచారంపై గౌరవనీయ హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిందని బీఆర్ నాయుడు తెలిపారు.

టీటీడీ చైర్మన్‌పై దుష్ప్రచార కథనాలు ప్రసారం, ప్రచారం చేయొద్దు.. హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీటీడీ చైర్మన్‌గా నా పై జరుగుతున్న విషప్రచారంపై గౌరవనీయ హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేసిందని బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా ఆసక్తికర వివరాలను పోస్ట్ చేశారు. నాపై ఆధార రహిత, దుష్ప్రచార కథనాలను ఇకపై ప్రసారం లేదా ప్రచారం చేయకూడదని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వెల్లడించారు. ఇప్పటికే ప్రచురితమైన కథనాలను తక్షణమే తొలగించాలని కూడా పేర్కొందని తెలిపారు. అలాగే గూగుల్, ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లకు సంబంధిత కంటెంట్‌ను డౌన్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయని పేర్కొన్నారు. తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా, ఏఐ, మార్ఫింగ్ వీడియోల ద్వారా నాపై దుష్ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు. సత్యం చివరకు గెలుస్తుంది.. ధర్మం వైపు నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.. అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story