ఒడ్డుకు కొట్టుకువచ్చిన భారీ తిమింగలం.. చూసేందుకు ఎగబడ్డ జనం

by Muthe.Rajitha |

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో సముద్ర తీరంలో ఈరోజు ఉదయం వాకింగ్ కు వెళ్లినవారికి ఓ షాకింగ్ దృశ్యం కనబడింది.

ఒడ్డుకు కొట్టుకువచ్చిన భారీ తిమింగలం.. చూసేందుకు ఎగబడ్డ జనం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అనకాపల్లి జిల్లాలో సముద్ర తీరంలో ఈరోజు ఉదయం వాకింగ్ కు వెళ్లినవారికి ఓ షాకింగ్ దృశ్యం కనబడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర సముద్రపు అలలకు ఓ భారీ తిమింగలం కళేబరం కొట్టుకువచ్చింది. మార్నింగ్ వాక్ కు బీచ్ కు వెళ్ళినవారు మొదట భయబ్రాంతులకు గురయ్యారు. తేరుకొని చూస్తే ఆ తిమింగలం మృతి చెందినట్టు గుర్తించారు. అంతేకాదు పలువురు ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా... తిమింగలాన్ని చూసేందుకు జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

వెటర్నరీ వైద్యులకు సమాచారం అందించగా.. తిమింగలం పోస్టుమార్టం అనంతరం దాని మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అయితే విచ్చలవిడి ప్లాస్టిక్ వాడకం వల్ల, వాటి వ్యర్థాలు సముద్రాన్ని చేరి, అక్కడి ప్రాణుల ఊపిరి తీస్తున్నాయని జంతుప్రేమికులు ఆవేదన చెందుతున్నారు.

Next Story