- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ లిక్కర్ ప్రకంపనలు: ప్రభుత్వంపై వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
నకిలీ లిక్కర్ కేసులో పెను ప్రకంపనలు కొనసాగుతున్నాయి...

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా(Annamayya)లో నకిలీ లిక్కర్(Counterfeit liquor) తయారు చేసి అమ్ముతున్న 10 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. నిందితులు అధికార పార్టీకి చెందిన నేతలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
దీంతో ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్(Ysr Congress) పార్టీ నేతలు ఏకిపారేస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్(Jagan) నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా కడప జిల్లా(Kadapa)కు చెందిన వైసీపీ నేత సతీశ్ రెడ్డి(YSRCP leader Satish Reddy) సైతం విమర్శలు కురిపించారు. జాతీయ రహదారి పక్కనే డెన్ ఏర్పాటు చేసుకుని నకిలీ లిక్కర్ తయారు చేరని మండిపడ్డారు. నకిలీ మద్యానికి నాణ్యమైన లేబుల్స్ పెట్టి మరీ అమ్ముకున్నారని చెప్పారు. ఈ గుట్టు వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. పట్టుబడ్డ నిందితుడు సురేంద్రనాయుడు తొలి నుంచి ఓ రాజకీయ పార్టీలో ఉన్నారని చెప్పారు. అరెస్ట్ చేసే సమయంలో పచ్చ చొక్కాతోనే ఉన్నారని సతీశ్ రెడ్డి తెలిపారు.






