ఒంటరి మహిళలకు చేయూత పేరుతో భారీ స్కాం.. ఆశ్రమాన్ని చూసి షాక్ తిన్న రాయపాటి శైలజ

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో ఓ భారీ స్కాం బయటపడింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ తనిఖీలు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఒంటరి మహిళలకు చేయూత పేరుతో భారీ స్కాం.. ఆశ్రమాన్ని చూసి షాక్ తిన్న  రాయపాటి శైలజ
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో ఓ భారీ స్కాం (Huge scam) బయటపడింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్ (Chairperson of the Women's Commission) రాయపాటి శైలజ తనిఖీలు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కడపలో సరస్వతి అనే మహిళ భర్త లేని ఒంటరి మహిళలకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వ నిధులతో ఆశ్రమం నిర్వహిస్తుంది. ఆశ్రమంలో 99 మంది నిర్వాసితులు ఉన్నట్లు రికార్డులు తయారు చేసి ప్రభుత్వం నుంచి నిత్యం నిధులు పొందుతున్నారు.

ఈ క్రమంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ (Rayapati Sailaja) ఒంటరి మహిళా నిర్వాసిత కేంద్రాన్ని (Single women's shelter) తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. ఆశ్రమంలో ఒక్క ఒంటరి మహిళ కూడా లేకపోవడంతో రాయపాటి శైలజ, ఆమెతో పాటు వెళ్లిన అధికారులు షాక్ అయ్యారు. అనంతరం ఆశ్రమాన్ని నడుపుతున్న సరస్వతిని నిలదీయగా అసలు విషయం బయటపెట్టింది. తప్పుడు రికార్డులతోనే ఆశ్రమం నడుపుతూ.. నిధులు పొందుతున్నట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ భారీ అవినీతి పై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు.

Next Story