- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. నారాయణగిరి షెడ్స్ వరకూ క్యూలైన్
నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ తో పాటు సంక్రాంతి సెలవులు కూడా మొదలు కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు నిన్నటితో (గురువారం) ముగిశాయి. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకూ 7 లక్షల మందికి దర్శనాలు కల్పిస్తామని చెప్పిన టీటీడీ.. అంతకుమించి సుమారు 7.90 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారి దర్శనాలు చేయించినట్లు వెల్లడించింది. ఈ 10 రోజుల్లో స్వామివారి హుండీ ఆదాయం రూ.36.86 కోట్లు సమకూరినట్లు తెలిపింది. అలాగే 2.06 లక్షల మంది భక్తులు తలనీలాల మొక్కులను చెల్లించుకోగా.. 37.97 లక్షల లడ్డూల విక్రయాలు జరిగాయి.
నేడు కొనసాగుతున్న భక్తుల రద్దీ
నేడు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ తో పాటు సంక్రాంతి సెలవులు కూడా మొదలు కావడంతో తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లు నిండి, నారాయణ గిరి షెడ్స్ వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాత క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని పేర్కొంది. సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. గురువారం 73,580 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోగా.. 18,465 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు సమకూరింది.






