- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ రిలీఫ్...విశాఖ పోర్టుకు భారీ LPG నౌక
విశాఖ పోర్టుకు భారీ LPG నౌక చేరుకుంది. BW Birch అనే ఎల్పీజీ నౌక విశాఖ తీరానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

దిశ, వెబ్ డెస్క్: LPG కొరత దేశ వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో బిగ్ రిలీఫ్ దక్కింది. తాజాగా విశాఖపట్నం పోర్టుకు భారీ LPG నౌక చేరుకుంది. BW Birch అనే ఎల్పీజీ నౌక విశాఖ తీరానికి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ సామర్థ్యంతో వచ్చింది ఈ నౌక . ఇక ప్రస్తుతం అన్లోడింగ్ ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు అధికారులు. స్థానిక ఇంధన అవసరాలను తీర్చడంలో ఈ సరకు అత్యంత కీలకమని చెబుతున్నారు.
విశాఖ పోర్ట్ అధికారుల పర్యవేక్షణలో గ్యాస్ ను సేఫ్ గా నిలువ కేంద్రాలకు చకచక తరలిస్తున్నారు. ఇక ఇండియాలో ఉన్న ప్రధాన ట్రాన్స్ షిప్మెంట్ కేంద్రాల ద్వారా ఈ భారీ నౌక విశాఖ తీరానికి చేరుకుంది. అయితే, విశాఖ తీరానికి ఈ భారీ నౌక వచ్చిన నేపథ్యంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారు. కాగా పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చమురు అలాగే ఎల్పీజీ కొరత ఇండియాలో ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా యుద్ధం ఆపిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.






