- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD:శ్రీవారి భక్తుల పెద్ద మనసు.. అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం
by Jakkula.Mamatha |
ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల(Tirumala) చేరుకుంటారు.

X
దిశ,వెబ్‌డెస్క్: ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల(Tirumala) చేరుకుంటారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో పలువురు భక్తులు(Devotees) టీటీడీ(TTD) ట్రస్టులకు విరాళాలు కూడా అందజేస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయవాడ(Vijayawada)కు చెందిన డాక్టర్ సాత్విక టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం అందజేశారు. ఈ తరుణంలో ఈ రోజు(సోమవారం) రూ.10 లక్షలు విరాళంగా అందించి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు.
Next Story






